Batchula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

TDP MLC Batchula Arjunudu hospitalized due to heart attack
  • ఈ తెల్లవారుజామున గుండెపోటుకు గురైన బచ్చుల
  • వెంటనే రమేశ్ ఆసుపత్రికి తరలింపు
  • స్టెంట్ వేసిన వైద్యులు
  • పరిస్థితి విషమంగానే ఉందన్న వైద్యులు
  • కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఈ తెల్లవారుజామున గుండుపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. 

వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు పరీక్షల అనంతరం స్టెంట్ వేశారు. అర్జునుడికి బీపీ ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. అర్జునుడు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బచ్చుల ఆరోగ్యంపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. విషయం తెలిసిన టీడీపీ నేతలు రమేశ్ ఆసుపత్రికి చేరుకున్నారు.
Batchula Arjunudu
TDP
Heart Attack
Vijayawada

More Telugu News