Pallas Cats: ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు
- ఎవరెస్ట్ పై పల్లాస్ పిల్లులు
- గ్రామాల్లో కనిపించే పిల్లుల కంటే పొట్టి పిల్లులు
- 1776లో రష్యాలో తొలిసారిగా గుర్తింపు
- 2019 నుంచి హిమాలయాల్లో వీటి కోసం అన్వేషణ
- ఎవరెస్ట్ పై ఉన్నది పిల్లాస్ పిల్లులేనని నిర్ధారణ
పర్వతారోహకులు తమ జీవితంలో ఒక్కసారైనా అధిరోహించాలని కలలు కనే పర్వతం ఎవరెస్ట్. హిమాలయాల్లో దట్టమైన మంచుతో కప్పబడి ఉండే ఎవరెస్ట్ అత్యంత అరుదైన జంతువులకు ఆవాసం అని తాజాగా వెల్లడైంది. అడవి పిల్లుల్లో కాస్త పొట్టిగా కనిపించే పల్లాస్ పిల్లులను ఎవరెస్ట్ పర్వతంపై గుర్తించారు. పల్లాస్ పిల్లులు గ్రామాల్లో కనిపించే పిల్లుల కంటే పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. వీటినే మసూల్ అని కూడా అంటారు.
1776లో తొలిసారిగా పీటర్ సైమన్ పల్లాస్ అనే శాస్త్రవేత్త ఈ పిల్లులను గుర్తించడంతో, ఆయన పేరు మీదే వీటిని పల్లాస్ పిల్లులు అని పిలుస్తారు. ఆయన రష్యాలోని బైకాల్ సరస్సు వద్ద తొలిసారిగా ఈ పిల్లులను గుర్తించారు. అవి జీవించే పరిసరాలకు అనుగుణంగా వివిధ రంగుల్లో ఉంటాయి. మంచు ప్రదేశాల్లో విపరీతమైన చలిని తట్టుకునేలా వీటికి పొడవైన వెంట్రుకలు ఉంటాయి.
2019 నుంచి హిమాలయాల్లోని సాగర్ మాతా జాతీయ పార్కులో పల్లాస్ పిల్లుల ఉనికికి సంబంధించిన అన్వేషణ కొనసాగుతోంది. పలు జన్యువిశ్లేషణల అనంతరం, ఎవరెస్ట్ పై సంచరిస్తున్నది పల్లాస్ పిల్లులే అని పరిశోధకులు నిర్ధారించారు.