Team New Zealand: టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. లక్నో మ్యాచ్‌లో ఒక్క సిక్సరూ నమోదు కాలేదు!

Both teams fail to hit a six in a T20I in India for the first time in history

  • 100 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆపసోపాలు పడిన టీమిండియా
  • ఒక్క బంతి మిగిలి ఉండగా విజయం
  • మ్యాచ్‌లో 14 ఫోర్లు మాత్రమే నమోదు
  • భారత గడ్డపై ఒక్క సిక్సర్ కూడా నమోదుకాని మ్యాచ్‌గా రికార్డు

భారత్-న్యూజిలాండ్ మధ్య లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలు పడిన టీమిండియా మరో బంతి మిగిలి ఉండగా విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 

ఈ మ్యాచ్‌లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఒక్క సిక్సర్ కూడా ఈ మ్యాచ్‌లో నమోదు కాలేదు. బౌలర్లకు సహకరించిన పిచ్‌పై పరుగులు చేయడానికే ఇబ్బంది పడిన బ్యాటర్లు బ్యాట్‌ను ఝళిపించలేకపోయారు. అడపా దడపా ఫోర్లతోనే సరిపెట్టుకున్నారు. భారత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఒక్క సిక్సర్ కూడా నమోదు కాకపోవడం ఇదే తొలిసారి. ఫోర్లు కూడా అతి స్వల్పంగా 14 మాత్రమే వచ్చాయి. కివీస్ జట్టు ఆరు ఫోర్లు కొట్టగా, భారత జట్టు 8 ఫోర్లు బాదింది.

  • Loading...

More Telugu News