Pavan Kalyan: 'సాహూ' దర్శకుడితో పవన్ .. పూజా కార్యక్రమానికి హాజరు!

Pavan and Sujeeth movie update
  • సెట్స్ పై ఉన్న 'హరి హర వీరమల్లు'
  • మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ 
  • నిర్మాతగా డీవీవీ దానయ్య 
  • దర్శకుడిగా సుజిత్ కి మరో భారీ ఛాన్స్  
పవన్ కల్యాణ్ కథనాయకుడిగా ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత పవన్ ఏ డైరెక్టర్ తో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే 'సాహూ' దర్శకుడు సుజిత్ తో కలిసి ఆయన ఒక సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమాలకి పవన్ హాజరయ్యారు. అందుకు సంబంధించిన అప్ డేట్ బయటికి వచ్చేసింది. డీవీవీ దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా ఉన్నారు. గతంలో ఆయన నుంచి భారీ హిట్లు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రతినాయకుడిగా ఎవరిని తీసుకోనున్నారు? సాంకేతిక నిపుణులు ఎవరు? రెగ్యులర్ షూటింగు ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కాస్త ఆలస్యమైనా సుజిత్ పెద్ద ప్రాజెక్టునే పట్టాడని చెప్పుకోవాలి..
Pavan Kalyan
DVV Danayya
Sujeeeth

More Telugu News