eye sight: మంచి కంటి చూపుకు ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో..!

Ayurvedic remedies to improve eye health

  • రోజులో 8 గంటల నిద్ర అవసరం
  • ఉదయాన్నే చల్లటి నీటితో కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి 
  • ఫుట్ మస్సాజ్ చేయాలి
  • శీర్షాసన, త్రాతక ఆసనాలతో మంచి ఫలితాలు

‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’.. కంటి చూపునకు అంతటి ప్రత్యేకత ఉంది. మరి నేటి జీవనంలో ఎలక్ట్రానిక్ తెరలు వచ్చి చేరాయి. ఇంట్లో టీవీ, ఆఫీసులో కంప్యూటర్, చేతిలో స్మార్ట్ ఫోన్ దాదాపు రోజులో 12-16 గంటల పాటు వీటిపైనే వెచ్చించే వారు ఎక్కువ మంది ఉన్నారు. కన్నార్పడం కూడా మర్చిపోయి పనిచేస్తున్నారు. దీనికితోడు తీసుకునే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయి. వెరసి కంటి చూపు తగ్గిపోతోంది. అందుకని ప్రతి ఒక్కరూ కంటి చూపును నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి కంటి చూపునకు చక్కని ఆయుర్వేద పరిష్కారాలను డాక్టర్ మహేందర్ సింగ్ బసు వెల్లడించారు.

  • ఆయుర్వేదం ప్రకారం ఉదయాన్నే నీళ్లను పుక్కిట పట్టి ఉంచి, కళ్లను చల్లటి నీటితో (సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్నవి) శుభ్రంగా కడుక్కోవాలి. కళ్లకు ఔషధాలతో కూడిన నెయ్యిని అప్లయ్ చేయవచ్చు. కంటిలో ఆయుర్వేద ఔషధ నెయ్యి, లేదంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి చుక్కలు వేసుకోవడం వల్ల వ్యర్థాలు తొలగిపోయి చూపు స్పష్టంగా మారుతుంది.
  • త్రతక్ కర్మ అనే మెడిటేషన్ ప్రక్రియ చేయాలి. చీకటిగా ఉన్న గదిలో క్యాండిల్ వెలిగించాలి. క్యాండిల్ జ్యోతిని అదే పనిగా కన్నార్పకుండా చూడాలి. అలా కొన్ని సెకన్లు లేదంటే అర నిమిషం వరకు చూడొచ్చు. దీనికితోడు త్రిఫల అనే ఔషధాన్ని రోజువారీ వాడుకోవచ్చు. 
  • పాద అభ్యంగన లేదంటే ఫుట్ మస్సాజ్ చేయాలి. హెర్బల్ ఆయిల్ తో కాలి పాదాలపై మర్ధన చేసుకోవాలి. 
  • రోజువారీగా కంటికి నేత్ర అంజన్ ధరించాలి. 
  • విటమిన్ ఏ ఎక్కువగా ఉండే క్యారట్ తదితర ఆహారాన్ని రోజువారీగా తీసుకోవాలి. 
  • శీర్షాసన, త్రాతక ఆసనాలతో కంటిపై ఒత్తిడి తగ్గి చూపు మెరుగుపడుతుంది. 
  • రోజువారీగా 8 గంటల పాటు మంచి నిద్ర మంచి కంటి చూపునకు అవసరం.

  • Loading...

More Telugu News