Economic Survey: ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- నేడు పార్లమెంటులో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
- ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టిన నిర్మల
- లోక్ సభ రేపటికి వాయిదా
పార్లమెంటులో ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో ప్రవేశ పెట్టడం ఆనవాయతీగా వస్తోంది. చీఫ్ ఫైనాన్స్ అడ్వైజర్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్ సభను రేపటికి వాయిదా వేశారు.
ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు:
* 2023-24 సంవత్సరానికి గాను వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చు.
* పీపీపీ పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ఎక్స్ ఛేంజ్ రేటు పరంగా
ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంది.
* వాస్తవ జీడీపీ 6 నుంచి 6.8 మధ్యలో ఉండొచ్చు.
* ఆర్థిక వ్యవస్థ కోవిడ్ ముందు స్థాయికి చేరుకుంది.
* ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఓడీబీ, ఆర్బీఐ అంచనాలకు తగ్గట్టుగానే భారత్ జీడీపీ వృద్ధి అంచనాలు ఉన్నాయి.
* కరెంట్ అకౌంట్ లోటు మరింత పెరిగితే ఇండియన్ కరెన్సీ రూపాయి ఒత్తిడికి లోనవుతుంది.
* కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కు ఫైనాన్స్ చేయడానికి తగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి.