Sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • 49 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 13 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3.41 శాతం లాభపడ్డ మహీంద్రా అండ్ మహీంద్రా  

పార్లమెంటులో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపరులు నేడు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 49 పాయింట్ల లాభంతో 59,550కి చేరుకుంది. నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 17,662 వద్ద స్థిరపడింది. పీఎస్యూ, ఇన్ఫ్రా, టెలికాం సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.41%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.09%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.85%), ఐటీసీ (2.21%). 

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-2.27%), బజాజ్ ఫైనాన్స్ (-2.26%), టెక్ మహీంద్రా (-2.01%), ఏసియన్ పెయింట్స్ (-1.43%), సన్ ఫార్మా (-1.30%).

  • Loading...

More Telugu News