Budget 2023: సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది?
- 2020లో నిర్మలా సీతారామన్ సుదీర్ఘ ప్రసంగం
- రెండు గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డ్
- మన్మోహన్ సింగ్ పేరిట పదాల పరంగా పెద్ద ప్రసంగం రికార్డ్
పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి అందులోని ప్రతిపాదనలను సభకు వివరిస్తారు. ఈ విధంగా బడ్జెట్ ప్రతిపాదనలపై సుదీర్ఘ ప్రసంగం ఎవరు చేశారో తెలుసా..? ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2020లో 2020-21 బడ్జెట్ సందర్భంగా రెండు గంటల 42 నిమిషాల పాటు ఆమె ప్రసంగించారు. ఇప్పటి వరకు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం ఇదే.
2019లో బడ్జెట్ (2019-20) సందర్భంగా నిర్మలా సీతారామన్ రెండు గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు నమోదు చేశారు. తిరిగి అదే రికార్డ్ ను 2020లో ఆమె బ్రేక్ చేశారు. ఇక 2022లో బడ్జెట్ సందర్భంగా మంత్రి సీతారామన్ కేవలం గంటన్నర పాటు మాత్రమే మాట్లాడారు. ఇది ఆమె బడ్జెట్ ప్రసంగాల్లో స్వల్ప నిడివితో కూడినది. సమయం కాకుండా పదాల పరంగా అతిపెద్ద ప్రసంగాన్ని (18,650 పదాలు) మన్మోహన్ సింగ్ 1991లో చేశారు. ఆ తర్వాత అరుణ్ జైట్లీ 18,604 పదాలతో కూడిన ప్రసంగాన్ని 2018లో చేశారు. 1977లో హిరూభాయ్ ముల్లిజి భాయ్ పటేల్ 800 పదాలతో చేసిన ప్రసంగం అతి చిన్నది.