sniffer dogs: పార్లమెంట్ బయట పోలీసు శునకాలతో బడ్జెట్ కాపీల తనిఖీ

Detection dogs sniff Union Budget copies outside Parliament vedio

  • స్నిఫర్ డాగ్స్ ను రంగంలోకి దింపిన పార్లమెంట్ భద్రతా సిబ్బంది
  • బడ్జెట్ కాపీల ప్యాకెట్ లను వాటితో తనిఖీ
  • పేలుడు పదార్థాలు, నార్కోటిక్స్ లేవని నిర్ధారణ

నిజానికి బడ్జెట్ అంటే ఎంతో ఆసక్తి నెలకొంటుంది. దేశవ్యాప్తంగా మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి, ఉన్నత వర్గాల వారు బడ్జెట్ ను ఆసక్తిగా గమనిస్తుంటారు. దీంతో కీలకమైన బడ్జెట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంటు వెలుపల సెక్యూరిటీ సిబ్బంది ప్రతి వాహనం నుంచి సిబ్బంది వరకు అందరినీ తనిఖీ చేస్తుంటారు. 

ఈ క్రమంలో బడ్జెట్ ప్రతులను పోలీసు శునకాలతో ప్రత్యేకంగా తనిఖీ చేయించడం ఆసక్తికరం. స్నిఫర్ డాగ్స్ ను పార్లమెంట్ భద్రతా సిబ్బంది బుధవారం రంగంలోకి దింపారు. వీటితో బడ్జెట్ 2023 ప్రతుల మూటలను తనిఖీ చేయించారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి విడుదలైంది. సంబంధిత మూటల్లో ఏవైనా పేలుడు పదార్థాలు, నార్కోటిక్స్ ఉన్నాయేమోనన్న అనుమానంతో వాటితో తనిఖీ చేయించారు. నేడు ఆర్థిక మంత్రి సమర్పిస్తున్న బడ్జెట్ మోదీ సర్కారు సెకండ్ ఇన్నింగ్స్ లో చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News