Budget: కేంద్ర వార్షిక బడ్జెట్: ఆదాయ పన్ను పరిమితి పెంపు

Income tax limitation hiked

  • బడ్జెట్ 2023-24 సమర్పణ 
  • పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ప్రసంగం
  • నూతన ఆదాయ పన్ను విధానంపై ప్రకటన
  • ఇన్ కమ్ టాక్స్ రిబేటు విస్తరిస్తున్నట్టు వెల్లడి

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్ లో వేతన జీవులపై కరుణ చూపించారు. అన్ని మినహాయింపులతో కూడుకుని రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఊరట కలిగిస్తూ, ఇన్ కమ్ టాక్స్ రిబేటును విస్తరిస్తున్నట్టు తెలిపారు. తద్వారా ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు. అయితే ఇది నూతన ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. 

ఇక నూతన శ్లాబుల్లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల గురించి వివరించారు. శ్లాబు రేట్ల సంఖ్యను 7 నుంచి 5కి తగ్గించినట్టు వెల్లడించారు. 

స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని తెలిపారు. 

రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని... రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను ఉంటుందని వివరించారు. 

రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను.... రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను... రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News