Mithun Reddy: కేంద్ర బడ్జెట్ లో ఏపీ స్పెషల్ స్టేటస్ పై ఎలాంటి హామీ లేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
- రైల్వే కారిడార్ గురించి ప్రస్తావించలేదని మిథున్ రెడ్డి విమర్శ
- ఆక్వా ఉత్పత్తుల దిగుమతి సుంకాలపై రాయితీ ఇవ్వడం మంచి పరిణామమని వ్యాఖ్య
- విభజన హామీలను అమలు చేయాలని పట్టుబడతామన్న ఎంపీ
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్ పై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందిస్తూ... ట్యాక్స్ బెనిఫిట్స్ తో మధ్య తరగతి ప్రజలకు ఉపయోగం కలుగుతుందని చెప్పారు. అయితే, విభజన హామీల విషయంలో కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి హామీలు లేవని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి బడ్జెట్ లో ప్రస్తావనే లేకపోవడం బాధాకరమని అన్నారు.
విభజన హామీల విషయంలో కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావన లేదని విమర్శించారు. రైల్వే కారిడార్ గురించి ప్రస్తావించలేదని అన్నారు. విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ బడ్జెట్ సమావేశాల్లో పట్టుబడతామని చెప్పారు. అయితే, ఆక్వా ఉత్పత్తుల దిగుమతి సుంకాలపై రాయితీ ఇవ్వడం మంచి పరిణామమని అన్నారు.