YS Sharmila: సచివాలయంలో మాక్ డ్రిల్ అంటూ అబద్ధాలు చెబితే నమ్మేవారెవరూ లేరు: షర్మిల

Sharmila reacts to fire accident news in Telangana new secretariat

  • తెలంగాణ నూతన సచివాలయంలో దట్టమైన పొగలు
  • అగ్నిప్రమాదం జరిగిందంటూ వార్తలు
  • మాక్ డ్రిల్ చేపట్టామన్న అధికారులు
  • దర్యాప్తునకు డిమాండ్ చేసిన షర్మిల
  • అఖిలపక్షం పరిశీలనకు అనుమతి ఇవ్వాలని స్పష్టీకరణ

ఇవాళ వేకువ జామున తెలంగాణ నూతన సచివాలయంలో దట్టమైన పొగలు వెలువడడంతో అగ్నిప్రమాదం సంభవించినట్టు భావిస్తున్నారు. అయితే, నూతన సచివాలయంలో మాక్ డ్రిల్ చేపట్టామని అధికారులు అంటున్నారు. దీనిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. రూ.1,100 కోట్లతో నిర్మించిన సచివాలయంలో సరైన భద్రతా ప్రమాణాలు లేవని బయటపడిందని తెలిపారు. దొరగారు ఏది కట్టినా పైన పటారం లోన లొటారం అంటూ ఎద్దేవా చేశారు.

ఇప్పటికైనా ప్రమాదం ఎందుకు జరిగిందన్నది అన్వేషించాల్సింది పోయి, మాక్ డ్రిల్ చేశాం అంటూ పచ్చి అబద్ధాలు చెబితే నమ్మేవారు ఎవరూ లేరని షర్మిల స్పష్టం చేశారు. ప్రారంభానికి సిద్ధం అవుతున్న సచివాలయంలో అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. అఖిలపక్షం నేతల పరిశీలనకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News