Nara Lokesh: పోలీసులు నన్ను అడ్డుకోవడం సరికాదు: నారా లోకేశ్

Lokesh padayatra details

  • చిత్తూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర
  • నేటికి 8వ రోజు.. 100 కిమీ పూర్తి 
  • వివిధ వర్గాలను కలుస్తూ ముందుకు సాగిన టీడీపీ యువనేత
  • పూతలపట్టు నియోజకవర్గంలో ఉద్రిక్తతలు

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్రకు నేడు 8వ రోజు కాగా నేటితో లోకేశ్ 100 కిమీ పూర్తిచేసుకున్నాడు. బంగారుపాళ్యంలో పోలీసులు సభకు అనుమతి ఇవ్వకపోగా, వాహనాలు సీజ్ చేయడంతో, లోకేశ్ ఓ భవనం బాల్కనీ నుంచి ప్రసంగించారు. 

జగన్మోహన్ రెడ్డి ఎందుకంత భయం నీకు? నీకు పౌరుషం ఉంటే నువ్వే నేరుగా రా... మధ్యలో పోలీసులెందుకు? పోలీసులను అడ్డుపెట్టి నా పాదయాత్రను ఆపాలని చూస్తారా? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

"నాడు జగన్ పాదయాత్ర చేస్తే జడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ, 4రోప్ పార్టీలు, ముగ్గురు డీఎస్పీలతో సాఫీగా సాగేలా చేశాం. ఖాకీలను అడ్డుపెట్టుకొని యువగళాన్ని ఆపలేరు...యువకుల కోసమే నేను యువగళం ప్రారంభించాను. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళాన్ని ఆపలేరు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. జీవో నెం.1 ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో. ఈ యువగళం పాదయాత్ర మాత్రం  ఆగదు" అని స్పష్టం చేశారు. 

పోలీసులు కూడా ఆలోచించాలి!

పోలీసులు కూడా ఆలోచించాలి. మీకు టీఏ, డీఏలు కూడా ఈ సీఎం ఇవ్వడం లేదు. మీకు న్యాయం కోసమే  నేను వచ్చాను. ఇలాంటి పవిత్ర యుద్ధాన్ని ఆపడం ఏమాత్రం సరికాదు.

అబద్దాలకు ప్యాంటు షర్టు వేస్తే జగన్ రెడ్డి

ఎన్నికల సమయంలో ఇస్తానన్న 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ అబద్ధం. జాబ్ క్యాలెండర్ అబద్ధం....ప్రత్యేక హోదా ఒక అబద్ధం. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ మహిళలకు 45ఏళ్లకే పెన్షన్ అబద్ధం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఒక అబద్దం. అమ్మఒడి అబద్ధం, ఆసరా అబద్ధం...సంపూర్ణ మద్యపాన నిషేధం పచ్చి అబద్ధం. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర అబద్ధం. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ వారంలో రద్దు ఒక అబద్ధం. 

రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి


జగన్ రెడ్డి రాయలసీమ బిడ్డ కాదు...రాయలసీమ ద్రోహి. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ చంపేశాడు. రాయలసీమలోని అమర్ రాజా బ్యాటరీ కంపెనీని మెడపట్టి బయటకు గెంటేశాడు. జగన్ రెడ్డికి దమ్ముంటే రాయలసీమకు ఏం చేశాడో బహిరంగంగా చెప్పాలి. ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి అన్నీ పెంచుతూ పోతాం అన్నాడు.

జగన్ రెడ్డి ఓ క్రిమినల్!

హూ కిల్డ్ బాబాయ్ ... బాబాయిని చంపిందెవరు...జగన్ కిల్డ్ బాబాయ్! వివేకా చాలా మంచి వ్యక్తి. కానీ ఈ జగన్ రెడ్డి గొడ్డలితో అత్యంత  దారుణంగా చంపించాడు.అందుకే అవినాష్ రెడ్డిని సీబీఐ రా...రా...అని పిలుస్తోంది. అతన్ని కాపాడుకునేందుకే ఢిల్లీకి జగన్ ఆఘమేఘాల మీద పరిగెత్తాడు. తల్లిని, చెల్లిని గెంటేసినవాడిని, బాబాయ్ ని చంపిన వాడు క్రిమినల్ కాదా?

అధికారంలోకి రాగానే అందరి సంగతి తేలుస్తాం!

ప్రభుత్వ సలహాదారుడు ఒక పవర్ బ్రోకర్. బహుశా ఇప్పుడు అతనే ఈ పాదయాత్ర, బహిరంగ సభ ఆపేయాలని పోలీసులకు ఫోన్ చేసి ఉంటాడు. టీడీపీ కేడర్ ను ఇబ్బంది పెట్టే వారి పేర్లన్నీ రాసుకున్నా... అధికారంలోకి వచ్చాక వారి సంగతి తేలుస్తాం. యువగళం ఆగదు... పవన్ కళ్యాణ్ వారాహి కూడా ఆగదు. ఆపాలని చూస్తే తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోతాం. నా తల్లిని అవమానించిన ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం.  

యువగళం పేరు వింటేనే జగన్ రెడ్డికి దడ

పలమనేరులో నేను మాట్లాడిన బండి డీఎస్పీ పట్టుకుపోయాడు. ఈ స్టేజిని కూడా పట్టుకుపోతారేమో. యువగళం పేరు వింటే ప్రభుత్వం వెన్నులో వణుకుపుడుతోంది. ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థ దాసోహం అయింది. 

పుంగనూరులో ఎగిరేది పసుపు జెండానే... 

 పెద్దిరెడ్డి ఇలాకాలో టీడీపీ కార్యకర్తలు చేసిన పోరాటం రాష్ట్రవ్యాప్తంగా కేడర్ కు స్ఫూర్తినిస్తుంది. పార్టీ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటుంది. పుంగనూరు పుడింగి సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేద్దాం... పసుపుజెండాను పుంగనూరులో ఎగరేద్దాం. అధికారంలోకి వచ్చాక మీపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తేస్తాం. అధైర్య పడకండి... మీ వెనక నేనున్నా, భయం టీడీపీ బయోడేటాలో లేదనేది మీరు నిరూపించారు... శభాష్! అంటూ కొనియాడారు.

  • Loading...

More Telugu News