sugar: పంచదారను నెలపాటు మానేస్తే ఏమవుతుంది?

What happens if you cut off sugar from your diet for a month

  • చక్కెర కారణంగా మన రక్తంలోకి అధిక కేలరీలు
  • దీని కారణంగా స్థూలకాయం, టైప్2 మధుమేహం, గుండె జబ్బులు
  • గణనీయంగా తగ్గించుకోవడం, లేదంటే మానివేస్తే మంచి ఫలితాలు

పంచదారను ఎక్కువ మంది ఇష్టపడతారు. పైగా మనం తీసుకునే ఎన్నో ఆహారాల్లో చక్కెర ఉంటుంది. ముఖ్యంగా కార్బోనేటెడ్ డ్రింక్స్, పళ్ల రసాలు, మిఠాయిలు, స్నాక్స్, బ్రెడ్ ఇలా ఎన్నో పదార్థాల్లో రిఫైన్డ్ షుగర్ ఉంటుంది. చక్కెరలో కేలరీలు తప్ప మరే పోషక పదార్థం ఉండదు. కనుక చక్కెరను ఎక్కువ తీసుకుంటే అధిక కేలరీలు శరరీంలోకి చేరిపోయి అనర్థం వాటిల్లుతుంది.

‘‘ముఖ్యంగా రిఫైన్డ్ షుగర్ ఆరోగ్యానికి మంచి కంటే హాని చేస్తుంది. అధిక కేలరీలు శరీరంలోకి చేరతాయి. ఫలితంగా స్థూలకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవన శైలి వ్యాధులకు కారణమవుతుంది. చక్కెరను తగ్గించే ఆహారంతో మంచి ఫలితం ఉంటుంది’’ అని ఫోర్టిస్ హాస్పిటల్ డాక్టర్ అమృత్ ఘోష్ అంటున్నారు. ముఖ్యంగా చక్కెరను ఒక నెల రోజుల పాటు తీసుకోకపోతే ఏం జరుగుతుందో వివరించారు. 

‘‘చక్కెరను తగ్గించేయడం లేదంటే తీసుకోవడాన్ని నిలిపివేస్తే బరువు తగ్గుతారు. చక్కెర అధిక కేలరీలతో కూడినది కావడంతో ఇది బరువు పెరిగేందుకు కారణమవుతుంది. చక్కెర అధిక మోతాదు వల్ల టైప్-2 మధుమేహం రిస్క్ పెరుగుతుంది. అంతేకాదు ఒక నెల పాటు చక్కెరను గణనీయంగా తగ్గించడం వల్ల శక్తి పెరుగుతుంది. చక్కెర రక్తంలో షుగర్ పెరిగిపోయేందుకు కారణమవుతుంది. దీంతో అలసట, బద్ధకంగా అనిపిస్తుంది. అందుకని చక్కెరను మానేస్తే అప్పుడు శక్తి స్థాయులు స్థిరంగా ఉంటాయి. రోజంతా చురుగ్గా ఉంటారు’’అని ఘోష్ వివరించారు. 

చక్కెరలు మానివేయడం వల్ల ఇన్ ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. చక్కెర కారణంగా పేగుల్లో ఇన్ ఫ్లమేషన్ ఏర్పడుతుంది. ఇది మంచి బ్యాక్టీరియాకు హాని చేస్తుంది. గుండె జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుందని ఘోష్ తెలిపారు. కనుక చక్కెరను ఒక నెల తగ్గించుకోవడం లేదంటే మానివేయడం మంచి ఫలితాలను ఇస్తుందని, ఆ తర్వాత కూడా దానిని కొనసాగించడం ఆరోగ్యానికి ఇంకా మంచిదని డాక్టర్ ఘోష్ సూచన.

  • Loading...

More Telugu News