Vodafone Idea: వొడాఫోన్ ఐడియాలో 33 శాతం వాటా తీసుకునేందుకు కేంద్రం రెడీ
- వొడాఐడియా కట్టాల్సిన బకాయిలకు బదులు ఈక్విటీ
- ఒక్కో షేరు రూ.10 చొప్పున కేటాయింపు
- అన్ని అనుమతులు మంజూరు చేసిన కేంద్రం
భారీ అప్పుల భారంతో కనాకష్టంగా నెట్టుకొస్తున్న ప్రైవేటు టెలికం సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియాకు కేంద్రం ఉపశమనం కల్పించింది. వొడాఫోన్ ఐడియా కేంద్ర ప్రభుత్వానికి స్పెక్ట్రమ్ బకాయిలు, వీటిపై వడ్డీలు చెల్లించాల్సి ఉంది. కానీ, వొడాఫోన్ వద్ద ఆర్థిక బలం లేదు. ఇప్పటికీ వార్షికంగా రూ.28 వేల కోట్ల నష్టాలను వొడాఫోన్ ఐడియా నమోదు చేస్తోంది. బకాయిలు చెల్లించలేని పరిస్థితుల్లో కంపెనీలో వాటా తీసుకునేందుకు కేంద్ర సర్కారు అంగీకారం తెలిపింది.