Arvind Kejriwal: కేజ్రీవాల్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పేరు
- ఆప్ ప్రభుత్వం గద్దె దిగాలంటూ బీజేపీ శ్రేణుల ఆందోళన
- పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట
ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై బీజేపీ దాడిని ముమ్మరం చేసింది. ఢిల్లీలోని ఆప్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆప్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.