New Judges: సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు
- గతంలోనే కేంద్రానికి సిఫారసు చేసిన కొలీజియం
- కొలీజియం సిఫారసులు రాష్ట్రపతికి పంపిన కేంద్రం
- ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. కొలీజియం సిఫారసుతో రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్రం పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. సుప్రీంకోర్టుకు నూతన న్యాయమూర్తులకు సంబంధించి కొలీజయం గతంలోనే కేంద్రానికి సిఫారసు చేసింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో తాజా నియామకాలకు మార్గం సుగమం అయింది.
ఈ నిర్ణయంతో పంకజ్ మిట్టల్ (రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్), సంజయ్ కరోల్ (పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్), పీవీ సంజయ్ కుమార్ (మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్), అహ్సానుద్దీన్ అమానుల్లా (పాట్నా హైకోర్టు న్యాయమూర్తి), మనోజ్ మిశ్రా (అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి) త్వరలోనే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా అడుగుపెట్టనున్నారు.