Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డిని వదిలి వెళ్లలేక కన్నీటిపర్యంతమైన గన్ మన్లు... వీడియో ఇదిగో!

Gunmen breaks into tears after MLA Kotamreddy returns his security personnel
  • ఇటీవల సొంతపార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన కోటంరెడ్డి
  • ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో తీవ్ర కలకలం
  • కోటంరెడ్డికి భద్రత తగ్గించిన ప్రభుత్వం
  • తానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానంటూ కోటంరెడ్డి ప్రకటన
  •  తనకు గన్ మన్లు అక్కర్లేదని స్పష్టీకరణ
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం తనకు కేటాయించిన గన్ మన్లను వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తనకు భద్రత తగ్గించిన నేపథ్యంలో, తానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానంటూ కోటంరెడ్డి తనకు గన్ మన్లు అక్కర్లేదని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, ఆయన గన్ మన్లు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కోటంరెడ్డిని వదిలి వెళ్లలేక కన్నీటిపర్యంతమయ్యారు.

దాంతో కోటంరెడ్డి కూడా చలించిపోయారు. గన్ మన్లను హృదయానికి హత్తుకుని ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గన్ మన్లను వెనక్కి ఇచ్చేయాలన్న తన ప్రకటనను సినిమా డైలాగు అనుకోవద్దని, తగ్గేదే లే అని తన వైఖరిని బలంగా చాటిచెప్పారు.
Kotamreddy Sridhar Reddy
Gunmen
Security
YSRCP
Nellore Rural
Andhra Pradesh

More Telugu News