Oesophageal Cancer: అన్నవాహిక కేన్సర్.. గుర్తించొచ్చు ఇలా..!

Oesophageal Cancer Risk factors symptoms diagnosis treatment prevention tips

  • తీసుకున్న ఆహారం మింగలేకపోవడం
  • ఛాతీలో నొప్పి, మంట
  • గొంతు బొంగురుపోవడం 
  • బరువు అసాధారణంగా తగ్గిపోవడం రిస్క్ ను సూచించేవి

గొంతు నుంచి జీర్ణాశయాన్ని కలిపే ట్యూబ్ ని అన్నవాహిక అంటారు. తిన్న ఆహారం, తాగిన పానీయాలను ఈ ట్యూబ్ జీర్ణాశయానికి చేరుస్తుంది. నేటి ఆహార అలవాట్లతో అన్నవాహిక కేన్సర్ రిస్క్ కూడా పెరుగుతోంది. అన్న వాహిక కేన్సర్ కు కారణాలు చూసినప్పుడు..

కారణాలు
గ్యాస్ట్రోఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) ముఖ్యమైనది. అలాగే, పొగతాగడం, అధిక బరువు, మద్యపానం అలవాట్లు ప్రధానంగా అన్న వాహిక కేన్సర్ కారణాలుగా ఉంటున్నాయి. అలాగే, రసాయనాల ప్రభావానికి లోను కావడం, కుటుంబంలో కేన్సర్ రిస్క్, వేడి పానీయాలను తీసుకోవడం, తగినన్ని పండ్లు, కూరగాయలు తీసుకోని వారికి కేన్సర్ రిస్క్ ఉంటుంది. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 

లక్షణాలు
అన్నవాహిక కేన్సర్ బారిన పడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మింగలేకపోవడం, ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, ఛాతీ భాగంలో నొప్పి, గుండెలో మంట తీవ్రంగా ఉండడం, దగ్గు, గొంతు బొంగురు పోవడం ఇవన్నీ కూడా అన్నవాహిక కేన్సర్ లక్షణాలుగా చూడొచ్చు. ఈ లక్షణాల్లో ఏదో ఒకటి ఉంటే కేన్సర్ అని అనుమానించక్కర్లేదు. ఒకటికి మించిన లక్షణాలు కనిపిస్తాయి. అయితే, వీటిల్లో ఏ లక్షణాలు కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరం. ఎందుకంటే కేన్సర్ అయితే ఆలస్యం చేస్తే కోలుకోవడం కష్టమవుతుంది.  

చికిత్సలు
సీటీ స్కాన్, ఈసోఫాజియల్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, బయాప్సీ, ఈసోఫాగో గ్యాస్ట్రో ఎండోస్కోపీ ద్వారా కేన్సర్ ను గుర్తిస్తారు. కేన్సర్ ఏ దశలో ఉందన్న దాని ఆధారంగా చికిత్స ఉంటుంది. సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ, ఎండోస్కోపిక్ లేజర్ థెరపీలను సూచించొచ్చు.

  • Loading...

More Telugu News