Natasha Perianayagam: ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతురాలైన విద్యార్థిని ఈ అమ్మాయే!

Natasha Perianayagam the most talented student in the world

  • టాలెంట్ టెస్టు నిర్వహించిన జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ
  • సీటీవై పేరిట 76 దేశాల్లో పరీక్షలు
  • పరీక్షకు హాజరైన 15 వేల మంది విద్యార్థులు
  • వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచిన నటాషా పెరియనాయగం

అమెరికాలోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇటీవల టాలెంట్ టెస్టు నిర్వహించింది. 76 దేశాల్లో నిర్వహించిన ఈ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీటీవై) పరీక్షకు 15 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే, ఇండో-అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియనాయగం ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. తద్వారా, 13 ఏళ్ల నటాషా ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతురాలైన విద్యార్థిగా నిలిచింది. హాప్కిన్స్ వర్సిటీ నిర్వహించే సీటీవై పరీక్షలో ప్రథమస్థానంలో నిలవడం నటాషాకు వరుసగా ఇది రెండోసారి. 

భారతీయ మూలాలున్న నటాషా పెరియనాయగం ప్రస్తుతం న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ ఎం గాడినీర్ మిడిల్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తోంది. ఆమె తల్లిదండ్రులు చెన్నైకి చెందినవారు. 2021లో నిర్వహించిన పరీక్షలోనూ ఆమె పాల్గొంది. అప్పటికి నటాషా ఐదో తరగతి చదువుతోంది. 

తాజా పరీక్షలోనూ నటాషా వయసుకు మించిన ప్రతిభ చూపి అందరినీ ఆకట్టుకుంది. వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో 90 పర్సంటైల్ తో ఆశ్చర్యానికి గురిచేసింది. 8వ తరగతి స్థాయి విద్యార్థుల స్థాయిలో ప్రతిభ చాటడం విశేషం.

  • Loading...

More Telugu News