Girl: రాయడంలో చిచ్చర పిడుగు.. రెండు చేతులతో ఒకేసారి, రివర్స్ లోనూ

Girl simultaneously writes with both hands video stuns netizens
  • మంగళూరుకు చెందిన బాలిక అద్భుత ప్రతిభ
  • ఒకేసారి రెండు టాస్క్ ల గురించి రాయగలదు
  • ఒకే అంశంపై రెండు చేతులతోనూ రాస్తూ వెళుతుంది
  • ఏక కాలంలో రెండింటితోనూ రివర్స్ లో రాయగలదు
రాయడంలో నేర్పరితనం గురించి వినే ఉంటారు. ఫలానా బాలుడు లేదా బాలిక రెండు చేతులతో ఏక కాలంలో రాస్తుందన్న వార్తలు అప్పుడప్పుడు, అక్కడక్కడా వినిపిస్తుంటాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకునేది మాత్రం చాలా అరుదైనది. 

మంగళూరుకు చెందిన ఆది స్వరూప అనే బాలిక రెండు చేతులతో ఏక కాలంలో రాయడం కాదు.. రెండు చేతులతో పదాలను రివర్స్ గా ఒకేసారి రాసుకుంటూ వెళుతుంది. ఒక అంశాన్ని రెండు చేతులతో సమన్వయం చేసుకుంటూ రాస్తూ వెళుతుంది. అంటే వేర్వేరు టాస్క్ లను రెండు చేతులతో విడివిడిగా ఏక కాలంలో చేయగలదు. ఒక టాస్క్ ను రెండు చేతులతో రాయగలదు. రివర్స్ లోనూ రాయగలదు. ఈ నైపుణ్యాలను చెప్పుకోవడం కంటే ఈ వీడియో ద్వారా చూస్తే, బాలిక ప్రత్యేక నైపుణ్యాల గురించి తెలుస్తుంది.

ఈ బాలిక ప్రతిభను చాటిచెప్పే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలపైకి చేరింది. ఇప్పటికే దీన్ని 13 లక్షల మంది చూసేశారు. మంగళూరుకు చెందిన ఈ బాలిక 11 రకాల భిన్నమైన శైలితో రాస్తుందని, మెదడులోని రెండు భాగాలు ఒకేసారి పనిచేస్తాయంటూ రవి కర్కర అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.
Girl
mangalore
writes
both hands
reverse writing

More Telugu News