Siddhu Jonnalagadda: సుకుమార్​ తో సిద్ధూ జొన్నలగడ్డ కొత్త చిత్రం

Siddhu Jonnalagadda new movie with sukumar Directed by Vaisshnavi
  • దర్శకురాలిగా పరిచయం కాబోతున్న వైష్ణవి
  • డీజే టిల్లుతో క్రేజీ హీరోగా మారిన సిద్ధూ
  • ప్రస్తుతం ఆ చిత్రం సీక్వెల్ లో నటిస్తున్న యువ హీరో
డీజే టిల్లు చిత్రంతో గతేడాది ఘన విజయంతో పాటు టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ. ఆ సినిమా తర్వాత అతనికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. స్టార్ డైరెక్టర్, రైటర్ సుకుమార్ కాంపౌండ్ లోకి అడుగు పెట్టాడు. సుకుమార్‌‌ రైటింగ్స్‌తో కలిసి బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ నిర్మించే సినిమాలో సిద్ధూ హీరోగా నటించనున్నాడు. వైష్ణవి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానుంది. సిద్ధూ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును చిత్ర బృందం ప్రకటించింది. సిద్ధూ స్టైలిష్‌ లుక్‌లో ఉన్న పోస్టర్ ను సోషల్ మీడియాతో షేర్ చేసింది. ఇది సిద్ధూకు ఎనిమిదో చిత్రం కావడం గమనార్హం.

ప్రేమ కథతో రూపొందే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు తెలియాల్సి ఉంది. సిద్ధూ ప్రస్తుతం ప్రస్తుతం డీజే టిల్లుకు సీక్వెల్ గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సిద్దూ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Siddhu Jonnalagadda
new movie
sukumar
writings

More Telugu News