Raveena Tandon: హీరో అక్షయ్ కుమార్ తో ఎంగేజ్ మెంట్ బ్రేక్ కావడంపై రవీనా టాండన్ స్పందన
- 90లో రవీనా టాండన్, అక్షయ్ కుమార్ ల ప్రేమాయణం
- ఇద్దరం నిశ్చితార్థం చేసుకున్నామన్న రవీనా
- ఆ తర్వాత ఇద్దరం చెరో దారి చూసుకున్నామని వెల్లడి
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సినీ నటి రవీనా టాండన్ల మధ్య ఆ రోజుల్లో కొనసాగిన ప్రేమాయణం సినీ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. అయితే, చాలా కథల మాదిరే ఈ ప్రేమకథ కూడా చివరకు పెళ్లిపీటలకు ఎక్కకుండానే ముగిసింది. ఇద్దరూ విడిపోయారు. ఇప్పటి వరకు దీనిపై ఏనాడూ కూడా వీరు స్పందించలేదు. తాజాగా ఈ అంశంపై రవీనా స్పందించారు. ఆరోజుల్లో తమ గురించి మీడియాలో రాస్తున్న కథనాలను కూడా తాను చదివేదాన్ని కాదని చెప్పారు. అంతే కాదు తమ బ్రేకప్ ను విడాకులతో కూడా ఆమె పోల్చారు.