Australia: నాగ్‌పూర్ టెస్ట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. సూర్య, భరత్ వచ్చేశారు!
- రిషభ్ పంత్ స్థానంలో శ్రీకర్ భరత్‌కు చోటు
- టెస్టుల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైన సూర్యకుమార్
- ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి భారత్
- ఆసీస్ జట్టులో రెండు మార్పులు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై భారత జట్టు ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతోంది. అలాగే, పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొట్టి స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టెస్టుల్లోనూ చోటు దక్కించుకున్నాడు. నేటి మ్యాచ్‌తో టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. అలాగే, గాయంతో దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ స్థానంలో శ్రీకర్ భరత్‌కు చోటు లభించింది. భరత్‌కు కూడా ఇదే తొలి టెస్టు.
ఇక ఆస్ట్రేలియా జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గాయంతో జట్టుకు దూరమైన బ్యాగీ గ్రీన్ స్థానంలో టాడ్ మర్ఫీ జట్టులోకి రాగా, ట్రావిస్ హెడ్ స్థానంలో హ్యాండ్స్కోంబ్ తుది జట్టులోకి వచ్చాడు.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మ్యాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్కోంబ్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్