Nara Lokesh: రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే పోలీసులకు మంచి పోస్టింగ్ లు ఇస్తున్నారు: లోకేశ్
- జీడీ నెల్లూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- లోకేశ్ పై మరో కేసు నమోదు
- అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేసే పోలీసులకు పోస్టింగ్ లు ఇవ్వట్లేదన్న లోకేశ్
తన యువగళం పాదయాత్ర సందర్భంగా పోలీసుల వైఖరిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకరిస్తే యువగళం... లేకపోతే రణరంగమే అని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే పోలీసులకు మంచి పోస్టింగ్ లు ఇస్తున్నారని, అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేసే పోలీసులకు పోస్టింగ్ లు ఇవ్వడంలేదని విమర్శించారు. నాటుసారా ఆపాలని మహిళలు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఇక, తన పాదయాత్ర సందర్భంగా లోకేశ్ వివిధ వర్గాలతో భేటీ అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జీడీ నెల్లూరులో జూనియర్ కళాశాల, డిగ్రీ కాలేజి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్య సేవల కోసం ఏరియా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.