Nara Lokesh: బలిజకాపులు, ఎస్సీలతో భేటీ కానున్న లోకేశ్.. ఈనాటి పాదయాత్ర షెడ్యూల్ ఇదిగో!
- 15వ రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
- ఉదయం గొల్ల కండ్రిగ గ్రామస్తులతో రచ్చబండ నిర్వహించిన లోకేశ్
- ఇప్పటి వరకు 170 కిలోమీటర్ల మేర కొనసాగిన యాత్ర
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర... ఈ ఉదయం రేణుకాపురం విడిది కేంద్రం నుంచి ప్రారంభమయింది. ఉదయం గొల్ల కండ్రిగ గ్రామస్తులతో లోకేశ్ రచ్చబండ సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం ఆయన బలిజకాపులు, ఎస్సీ సామాజికవర్గాలతో భేనున్నారు. కాపు కండ్రిగలో మధ్యాహ్నం భోజన విరామం ఉంటుంది. మరోవైపు లోకేశ్ పాదయాత్ర ఇప్పటి వరకు 169.5 కిలోమీటర్ల మేర కొనసాగింది. నిన్న ఆయన 14 కిలోమీటర్ల మేర పాదయాత్రను కొనసాగించారు.
ఈనాటి (10-02-2023) లోకేశ్ పాదయాత్ర షెడ్యూల్:
- ఉదయం 8 గంటలకు రేణుకాపురం విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
- 8.35 గంటలకు గొల్ల కండ్రిగ గ్రామస్తులతో రచ్చబండ సమావేశం.
- 10.30 గంటలకు ఎగువ కమ్మ కండ్రిగలో రైతులతో మాటమంతీ.
- మధ్యాహ్నం 12.05 గంటలకు దిగువ కమ్మ కండ్రిగలో బెల్లం తయారీదారులతో మాటామంతీ.
- 1.10 గంటలకు కాపు కండ్రిగలో బలిజకాపులతో సమావేశం.
- 1.25 గంటలకు కాపు కండ్రిగలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
- 2.10 గంటలకు కాపు కండ్రిగలో భోజన విరామం.
- 3.10 గంటలకు కాపు కండ్రిగ నుంచి పాదయాత్ర కొనసాగింపు.
- సాయంత్రం 5.40 గంటలకు ఎస్ఆర్ పురం గ్రామస్తులతో మాటామంతీ.
- 6.10 గంటలకు ఎస్ఆర్ పురం హనుమాన్ టెంపుల్ వద్ద ప్రముఖులతో సమావేశం.
- 7.00 గంటలకు ఎస్ఆర్ పురం హనుమాన్ టెంపుల్ ఎదుట విడిది కేంద్రంలో బస.