mumbai: పెంట్ హౌస్ కోసం రూ.240 కోట్లు వెచ్చించిన బిజినెస్ మ్యాన్

Mumbai businessman buys penthouse for Rs 240 crore

  • ముంబైలోని వర్లీలో కొనుగోలు చేసిన బీకే గోయెంకా
  • పెంట్ హౌస్ రిజిస్ట్రేషన్ లో అత్యంత ఖరీదైనదిగా రికార్డు
  • రాబోయే రోజుల్లో మరిన్ని డీల్స్ జరుగుతాయంటున్న నిపుణులు
  • ఆదాయ పన్ను నిబంధనల్లో మార్పులే కారణమని వివరణ

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ పెంట్ హౌస్ రికార్డు ధరకు అమ్ముడు పోయింది. సెలబ్రెటీలు, సంపన్నుల కోసం ముంబైలోని వర్లీలో ప్రత్యేకంగా రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణం జరుగుతుంటుంది. అలాంటిదే వర్లీలోని టవర్ ‘బి’.. ఈ టవర్ లో 63, 64, 65 అంతస్తులలో విశాలమైన పెంట్ హౌస్ ను నిర్మించారు. వెల్స్ పన్ గ్రూప్ యజమాని బీకే గోయెంకా ఈ పెంట్ హౌస్ కోసం ఏకంగా రూ.240 కోట్లు వెచ్చించారు.

బుధవారం దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారం కూడా పూర్తయిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ పూర్తయిన పెంట్ హౌస్ లలో అత్యంత ఖరీదైనది ఇదేనని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఖరీదైన డీల్స్ మరిన్ని జరుగుతాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఆదాయపన్ను నిబంధనలలో మార్పుల వల్ల ఖరీదైన ఇళ్ల కొనుగోలు మరింత పెరుగుతుందని అంటున్నారు. 

దీర్ఘకాలిక పెట్టుబడులపై వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపును రూ.10 కోట్లకు కేంద్రం పరిమితం చేయాలని నిర్ణయించింది. ఆ మొత్తం దాటితే పన్ను విధించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి రానుంది. దీంతో ఖరీదైన విల్లాలు, అపార్ట్ మెంట్లు కొనుగోలు చేసే సంపన్నుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News