Rohit Sharma: ఓవైపు వికెట్లు వరుసగా పడుతున్నా... సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ
- 171 బంతుల్లో సెంచరీ సాధించిన రోహిత్
- 12 రన్స్ లీడ్ లో టీమిండియా
- నాలుగు వికెట్లు పడగొట్టిన మర్ఫీ
ఆస్ట్రేలియాతో నాగ్ పూర్ లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. మరో ఎండ్ లో మన బ్యాట్స్ మెన్ వరుసగా ఔట్ అవుతున్నా... ఏమాత్రం చెదరని ఏకాగ్రతతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 171 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 2 సిక్సర్లు, 14 ఫోర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేశాడు.
మరోవైపు ఈ ఉదయం ఒక వికెట్ నష్టంతో 77 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. అయినప్పటికీ రోహిత్ శర్మ తనదైన స్టైల్లో ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ప్రస్తుతం భారత్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 12 పరుగుల లీడ్ లో ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ 103 పరుగులతో, రవీంద్ర జడేజా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇతర బ్యాట్స్ మెన్లలో కేఎల్ రాహుల్ 20, అశ్విన్ 23, పుజారా 7, కోహ్లీ 12, సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో మర్ఫీ 4 వికెట్లను పడగొట్టగా, లియోన్ ఒక వికెట్ తీశాడు.