Hansika: నా భర్తకు గతంలోనే వివాహం జరిగిందని నాకు తెలుసు: హన్సిక

Hansika reacts to social media propaganda about her husband
  • ఇటీవల తన పెళ్లి విషయం బయటపెట్టిన హన్సిక
  • ప్రియుడు సొహైల్ ను పెళ్లాడినట్టు వెల్లడి
  • అయితే సొహైల్ విడాకులకు హన్సిక కారణమంటూ ప్రచారం
  • ఖండించిన హన్సిక 
దక్షిణాదిన తన అందచందాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ముద్దుగుమ్మ హన్సిక ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు సొహైల్ ను వివాహమాడి దాంపత్య జీవితంలోకి ప్రవేశించింది. అయితే, హన్సిక భర్త సొహైల్ కు గతంలోనే పెళ్లి జరిగింది. అయితే, అతడి వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి హన్సికనే కారణమంటూ ప్రచారం జరుగుతోంది. సొహైల్ మొదటి పెళ్లికి హన్సిక హాజరైన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. 

దీనిపై హన్సిక స్పందించింది. సొహైల్ గురించి జరుగుతున్న ప్రచారం మొదట్లో తనను ఆందోళనకు గురిచేసిందని, అయితే తల్లి సూచనలు పాటించి తమ పెళ్లి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నానని హన్సిక వెల్లడించింది.  తన భర్తకు గతంలోనే పెళ్లయిందన్న సంగతి తనకు తెలుసని వెల్లడించింది. అయితే అతడి విడాకులకు తాను ఎంతమాత్రం కారణం కాదని హన్సిక స్పష్టం చేసింది. 

గతంలో తాను ఓ సంబంధంలో ఉన్నానని, అది చాలామందికి తెలిసిన విషయమేనని పేర్కొంది. మరోసారి అలాంటి రిలేషన్ షిప్ ను తాను కోరుకోవడంలేదని వెల్లడించింది. జనాల్లోకి వస్తే తన భర్తతోనే కలిసి రావాలని నిర్ణయించుకున్నానని హన్సిక వివరించింది. అందుకే, సొహైల్ తన జీవితంలో ప్రవేశించిన క్షణాలు ఎంతో మధురం అని తెలిపింది.
Hansika
Sohail
Marriage
Actress

More Telugu News