Nara Lokesh: పొలంలో అరక దున్నిన నారా లోకేశ్... ఈనాటి పాదయాత్ర హైలైట్స్
- లోకేశ్ పాదయాత్రకు నేడు 15వ రోజు
- జీడీ నెల్లూరు నియోజకవర్గంలో యువగళం
- రేణుకాపురం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం
- వివిధ వర్గాలను కలిసి సమస్యలు తెలుసుకున్న లోకేశ్
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. యువగళం పేరిట యువత సమస్యలు, వారి మనోభావాలను తెలుసుకుంటూ లోకేశ్ సాగిస్తున్న ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్రకు నేడు 15వ రోజు కాగా, జీడీ నెల్లూరు నియోజకవర్గం రేణుకాపురం క్యాంప్ సైట్ నుంచి ఈ ఉదయం ప్రారంభమైంది.
పాదయాత్ర సాగిందిలా...
- బెంగళూరు వలసవెళ్లిన జీడీ నెల్లూరు వ్యాపారులు లోకేశ్ తో భేటీ
- టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎటువంటి వేధింపులు లేకుండా స్వేచ్చగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తామని, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామని చెప్పిన లోకేశ్
- జగన్ పాలనలో జే ట్యాక్స్ బెదిరింపుల దెబ్బకి భయపడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారు.
- ఒక్క అమరరాజా వెళ్లిపోవడం వలన దాదాపు 20 వేల మంది రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.
- అనంతపురంలో జాకీ పరిశ్రమను కూడా అక్కడ ఎమ్మెల్యే కమీషన్లకోసం వత్తిడి చేసి తరిమేశారని విమర్శలు
- ఎగువ కమ్మ కండ్రికలో లోకేశ్ ఒక రైతు పొలంలోకి వెళ్లి అరకదున్నతూ ఆ రైతు కష్టాలు తెలుసుకున్నారు.
- శుక్రవారం నాడు లోకేశ్ పాదయాత్రలో మైక్ కు అనుమతి ఇవ్వలేదు. పద్మాపురంలో స్టూలుపై నిల్చొని మైక్ లేకుండానే లోకేశ్ ప్రజలనుద్దేశించి ప్రసంగించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా లోకేశ్ పోలీసుల చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. "జగన్ ఓ పిరికిపంద.. పోలీసులతో నా పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు... నన్ను ఎంతగా ఆపాలని చూస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్తా... ప్రజాదరణతో సాగుతున్న యువగళాన్ని ఎవరూ ఆపలేరు" స్పష్టంచేశారు.
- కాపుకండ్రికలో యువనేతను పలువురు కాపులు కలిసి వినతిపత్రం సమర్పించారు. కాపులకు రిజర్వేషన్ ను అమలుచేసేందుకు కృషిచేయాలని కోరారు.
- కాపు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ప్రారంభించాలని కోరారు.
- కాపు కార్పొరేషన్ కు రూ.10వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని, కాపుబిడ్డలు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందించాలని, పేద కాపు మహిళలకు 45 సంవత్సరాల వయసునుంచి పెన్షన్ ఇవ్వాలని విజ్జప్తిచేశారు
- అవకాశం ఉన్నా కాపులకు రిజర్వేషన్ కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందన్న లోకేశ్.
- కాపు రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉంది. కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి వారి స్వావలంబనకు కృషిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసిన విదేశీ విద్య పథకాన్ని పునరుద్దరిస్తామని లోకేశ్ హామీ
- జీడీ నెల్లూరు నియోజకవర్గం కాపుకండ్రికలో ఎస్సీలతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు.
- ఏపీ చరిత్రలో మొదటి సారిగా దళితుల చేతుల్లో భూమి తగ్గిందన్న లోకేశ్
- ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా దళితుల భూములు కొట్టేస్తున్నారని వ్యాఖ్యలు
- అంబేద్కర్ విదేశీ విద్యకు పేరు మార్చడమే కాదు... ఆ పథకాన్నే జగన్ రెడ్డి ఎత్తేశారు. దళితులు అభివృద్ధి చెందేందుకే విదేశీ విద్య ప్రవేశపెట్టాం. అధికారంలోకి రాగానే మళ్లీ విదేశీ విద్య తీసుకొస్తాం... అంబేద్కర్ పేరు కొనసాగిస్తాం అంటూ ఎస్సీలకు లోకేశ్ భరోసా
- టీడీపీ అధికారంలోకి వచ్చాక జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు నిధులు కేటాయిస్తామని హామీ
- గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎగువ కమ్మ కండ్రిక వద్ద నారా లోకేశ్ తో బెల్లంరైతుల భేటీ
- బెల్లం రైతులకు ఒకప్పటిలాగా లాభాలు లేవని, కేజీ ధర రూ.40 నుండి రూ.25కు పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
- దీనికితోడు బెల్లం తయారీదారులకు తరచూ అధికారులనుంచి వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు.
- ఆందోళన చేసినపుడు తమను ఆదుకుంటామని హామీ ఇచ్చిన వైసీపీ మంత్రులు ఇప్పుడు కనబడటం లేదన్నారు.
- వైసీపీ ప్రభుత్వంలో ప్రశాంతంగా బతుకుతున్న వర్గమంటూ లేదన్న లోకేశ్.
- తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్లం రైతులను ఆదుకుంటాం. మరో ఏడాది ఓపిక పట్టండి అంటూ వారికి సూచించిన లోకేశ్
- చిత్తూరు - పుత్తూరు ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులకు కనువిందు చేస్తున్న కమ్మరాయ గుట్టను పరిశీలించిన లోకేశ్
- సుందరమైన కొండ కనుమరుగమవుతోందంటూ లోకేశ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన సమీప గ్రామాల ప్రజలు
- రాష్ట్రంలో వైసీపీ నేతల దోపిడీకి ఇదొక నిదర్శనమన్న లోకేశ్
డీకేటీ విషయంలో కర్ణాటక మోడల్ పరిశీలిస్తాం: లోకేశ్
జగన్ రెడ్డి ప్రభుత్వంలో కోర్టుల్లో అధికభాగంగా రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయి. గతంలో చంద్రబాబు విశాఖ, సింహాచలం భూముల్ని రెగ్యులర్ చేసి పట్టాలు అందించారు. డీకేటీ పట్టా విషయంలో కర్ణాటక మోడల్ అమలు చేయాలని నా అభిప్రాయం. పార్టీలో పెద్దలతో చర్చించి ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచిస్తాం.
చంద్రబాబు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు... అమలు చేశారు. కానీ జగన్ 300 యూనిట్లు ఫ్రీ అన్నాడు... అమలు చేయలేదు.
బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల గురించి అడిగితే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను మార్చాం అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. నియామకాలు లేకుండా ధీటుగా ఎలా తయారవుతాయి? బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల బిల్లులను ఈ ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు. కేజీ టు పీజీ సిలబస్ ను ఇంకా పటిష్టం చేయాలి. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు లేని చోట ప్రైవేటు స్కూళ్లలో చేరిన వారికి ఫీజు రీయింబర్స్ చేస్తాం.
లోకేశ్ పాదయాత్ర వివరాలు
ఇప్పటివరకు నడిచిన దూరం: 183.5 కిలోమీటర్లు
15వరోజు (10-2-2023) నడిచిన దూరం: 14 కిలోమీటర్లు
యువగళం పాదయాత్ర 16వ రోజు (11-02-2023) శనివారం షెడ్యూల్ వివరాలు
జీడీ నెల్లూరు నియోజకవర్గం
ఉదయం
8.00– ఎస్ఆర్ పురం హనుమాన్ టెంపుల్ విడిది కేంద్రంలో యాదవ సామాజిక వర్గీయులతో సమావేశం. అనంతరం పాదయాత్ర ప్రారంభం.
8.30– ఎస్ ఆర్ పురం హనుమాన్ టెంపుల్ లో పూజలు.
8.55 – ఎస్ఆర్ పురం గ్రామస్తులతో మాటామంతీ.
10.10– పుల్లూరు క్రాస్ వద్ద చెన్నయ్ టిడిపి ఫోరం ప్రముఖులతో భేటీ.
11.15– దిగువ మెడవడ ఎస్టీ కాలనీలో ఎస్టీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
11.30– పిల్లారి కుప్పం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
మధ్యాహ్నం
12.20– మూలూరులో స్థానికులతో మాటామంతీ.
12.45– వెంకటాపురంలో స్థానికులతో మాటామంతీ.
2.35– వెంకటాపురంలో భోజన విరామం
సాయంత్రం
3.35– వెంకటాపురంలో యువనేత ఎదుట పలువురు పార్టీలో చేరిక.
4.15– చిలమకూలపల్లెలో స్థానికులతో మాటామంతీ.
4.50– ఉడమలకుర్తిలో స్థానికులతో మాటామంతీ.
6.40– కఠారిపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
7.05– కొత్తూరు విడిది కేంద్రంలో బస.