Allu Arjun: కష్టంలో ఉన్న అభిమాని కోసం అల్లు అర్జున్ సాయం

Allu Arjun extends financial help to a fan netizens hail and tag him as kind hearted
  • ‘అల్జు అర్జున్ ఫ్యాన్స్’ క్లబ్ సభ్యుడికి ఆర్థిక ఇబ్బందులు
  • అనారోగ్యంతో ఉన్న తండ్రి చికిత్స కోసం అధిక వ్యయం
  • సాయం కోసం ట్విట్టర్లో పిలుపు
అల్లు అర్జున్ కష్టంలో ఉన్న తన అభిమాని కోసం పెద్ద మనసు చేసుకున్నాడు. ఆర్థిక సాయంతో అభిమాని కుటుంబంలో సంతోషాన్ని నింపాడు. అల్జు అర్జున్ ఫ్యాన్స్ క్లబ్ ఇటీవలే తన క్లబ్ సభ్యుడు ఒకరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటూ పోస్ట్ పెట్టింది. శ్వాస కోస సమస్యతో బాధపడుతున్న తన తండ్రి వైద్య చికిత్సల కోసం నిధుల అవసరం ఏర్పడినట్టు చెప్పింది. 

ఈ విషయం తెలియడంతో అల్లు అర్జున్ తగినంత సాయాన్ని అందించాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ధ్రువీకరించింది. ‘‘ఇటీవలే మా సహ అభిమాని ఒకరి సమస్యను ప్రస్తావించగా, ఇది తెలుసుకుని అల్లు అర్జున్ కావాల్సిన అన్ని రకాల సాయాన్ని అందించాడు. తన బృందంతో కలసి కావల్సినంత సమకూర్చాడు’’ అని ట్వీట్ చేశాడు. దైవం మనుష్య రూపేణా అంటూ అల్లు అర్జున్ కు ట్యాగ్ చేశారు. 

Allu Arjun
financial help
netizens
fan

More Telugu News