Govt Doctors: వైద్య సిబ్బందికి హర్యానా ప్రభుత్వం డ్రెస్ కోడ్.. ముస్తాబై రావొద్దని ఆదేశం!

Dress Code For Haryana Hospital Staff

  • రకరకాల హెయిర్‌ స్టైల్స్, పొడవైన గోర్లతో రావొద్దని సూచన
  • రోజులో 24 గంటలూ డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందేనన్న ఆరోగ్య మంత్రి
  • ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టీకరణ
  • ఉల్లంఘించి విధులకు వస్తే ఆబ్సెంట్ తప్పదని హెచ్చరిక

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి హర్యానా ప్రభుత్వం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ప్రకటించింది. మేకప్ వేసుకుని నగలు ధరించి విధులకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. టీషర్టులు, జీన్స్, స్కర్ట్స్‌ ధరించొద్దని అలాగే, రకరకాల హెయిర్‌స్టైల్స్, పొడవైన గోర్లతో ఆసుపత్రికి రావొద్దని సూచించింది. 

ఈ డ్రెస్ కోడ్ విషయంలో వైద్య సిబ్బందికి ఎలాంటి మినహాయింపులు ఉండవని, వైద్యులు సహా అందరూ తప్పకుండా పాటించాల్సిందేనని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. డ్రైస్‌కోడ్‌ను ఉల్లంఘించి ఆసుపత్రులకు వస్తే విధులకు వారు గైర్హాజరైనట్టుగానే పరిగణిస్తామని అన్నారు. 

వారాంతాలపాటు 24 గంటలూ డ్రెస్ కోడ్ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాత్రి సమయంలో విధుల్లో ఉన్నవాళ్లు కూడా దీనిని అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పారు. వృత్తికి ఇది మరింత హుందాతనాన్ని తెస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News