Tamilisai Soundararajan: నా శరీర రంగును విమర్శిస్తున్నారు.. వారు ఓర్వలేని స్థాయికి చేరుతా: గవర్నర్ తమిళిసై

Governor Tamilisai Fires on who criticise her skin colour
  • చెన్నైలో ఓ ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవానికి హాజరైన తమిళిసై
  • తాను నల్లగా ఉన్నానంటూ విమర్శలు చేస్తున్నారని ఆవేదన
  • నలుపు అని విమర్శిస్తే అగ్గిలా మారతానని హెచ్చరిక
తన శరీర రంగును విమర్శిస్తున్న వారిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను విమర్శించే వారు ఓర్వలేనంత స్థాయికి ఎదుగుతానన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని తొండియార్‌పేట బాలికల ప్రైవేటు పాఠశాలలో శనివారం జరిగిన వార్షికోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన శరీర రంగు గురించి కొందరు పదేపదే విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రంగు నలుపు అని, తన నుదురు బట్టతలలా ఉంటుందని కొందరు  హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుపు అంటూ మరోమారు తనను విమర్శిస్తే అగ్గిలా మారతానని హెచ్చరించారు. విమర్శలు పట్టించుకోబోనన్న తమిళసై.. తనను విమర్శించే వారు ఓర్వలేనంత ఉన్నత స్థాయికి చేరుకుంటానని అన్నారు.
Tamilisai Soundararajan
Telangana
Chennai
Black

More Telugu News