Balakrishna: హాట్ స్టార్ లో 'వీరసింహా రెడ్డి' .. ట్రైలర్ రిలీజ్!

Veerasimha Redddy OTT Release Date

  • జనవరి 12న విడుదలైన 'వీరసింహారెడ్డి'
  • మాస్ ఆడియన్స్ ను అలరించిన సినిమా 
  • తమన్ పాటలకు లభించిన ఆదరణ 
  • ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'వీరసింహా రెడ్డి' జనవరి 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. కథాకథనాల పరంగా .. పాటల పరంగా .. డాన్సుల పరంగా .. డైలాగ్స్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ట్రైలర్ ను కొంతసేపటిక్రితం రిలీజ్ చేశారు. 

శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ .. దునియా విజయ్ .. హనీ రోజ్ కీలకమైన పాత్రలను పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక ఇదే బ్యానర్లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సినిమా, ఈ నెల 27వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ కానుందనే సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News