Narendra Modi: ‘పుల్వామా’ అమరుల త్యాగాలను ఎన్నటికీ మరువం: ప్రధాని మోదీ

PM Modi remembers martyrs says will never forget their supreme sacrifice

  • ‘పుల్వామా’ ఉగ్రదాడి జరిగి నేటికి నాలుగేళ్లు
  • నాటి ఘటనలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్లను స్మరించుకున్న ప్రధాని మోదీ
  • వారి అత్యున్నత త్యాగాలను ఎన్నటికీ మరవమంటూ ట్విట్టర్‌లో వ్యాఖ్య

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ‘ఉగ్ర’దాడి జరిగి నేటికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమర జవాన్లను స్మరించుకున్నారు. వారి అత్యున్నత త్యాగాన్ని ఎన్నటికీ మర్చిపోమంటూ ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. 

2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వాహనాల్లో 2500 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను తరలిస్తున్నారు. ఈ సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 

ఈ దాడి వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందని భారత్ మండిపడగా..దాయాది దేశం ఈ ఆరోపణను ఖండించింది. ఈ క్రమంలో భారత్.. బాలాకోట్‌లోని జైష్-ఏ-మహ్మద్ సంస్థ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. సుమారు 350 మంది ఉగ్రమూకలను మట్టుపెట్టింది.  

  • Loading...

More Telugu News