Akashvani: ప్రపంచంలోనే అతి పెద్ద రేడియో నెట్ వర్క్ లలో ఒకటి... మన 'ఆకాశవాణి'!

Akashvani radio network details

  • నమ్మదగిన వార్తలకు చిరునామాగా ఆకాశవాణి
  • వివిధ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చెరగని స్థానం
  • ప్రపంచంలో చాలా భాగాల్లో ఆకాశవాణి ప్రసారాలు
  • దేశంలో 99.19 శాతం మందికి అందుబాటులో రేడియో

ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కానీ, ఒకప్పుడు సమాచారం కోసం రేడియోపైనే ఆధారపడేవారు. ప్రభుత్వ రేడియో కేంద్రం ఆకాశవాణి ఎప్పటికప్పుడు విశ్వసనీయ వార్తలను అందిస్తూ, ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తున్నప్పటికీ, రేడియో శ్రోతలు ఇంకా ఉన్నారు. 

నిన్న (ఫిబ్రవరి 13) ప్రపంచ రేడియో దినోత్సవం. ఈ సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆసక్తికర సమాచారం వెల్లడించింది. 75 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన మన ఆకాశవాణి... ప్రసార భాషలు, శ్రోతల సంఖ్య, విస్తీర్ణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రసార నెట్ వర్క్ లలో ఒకటిగా నిలుస్తుంది. 

దేశవ్యాప్తంగా 92 శాతం విస్తీర్ణంలో 467 కేంద్రాలు ఉండగా, 99.19 శాతం మందికి రేడియో అందుబాటులో ఉంది. ఆకాశవాణి 23 భాషల్లో, 146 మాండలికాల్లో ప్రసారాలు కొనసాగిస్తోంది. ఆకాశవాణి 662 బ్రాడ్ కాస్టింగ్ ట్రాన్స్ మిటర్లు, 432 ఎఫ్ఎం రేడియో ట్రాన్స్ మిటర్లు కలిగి ఉంది.  

ఆకాశవాణి నెట్ వర్క్ లో ఒక్కరోజులో 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. భారతీయ, విదేశీ భాషల్లో ప్రసారాలు సాగిస్తున్న ఆకాశవాణికి 47 ప్రాంతీయ వార్తా విభాగాలు, 116 ప్రాంతీయ చానళ్లు, వివిధ భారతి స్టేషన్లు, 17 లైవ్ స్ట్రీమింగ్ చానళ్లు ఉన్నాయి. 

భారత్ లోనే కాదు ఆస్ట్రేలియా, దక్షిణాసియా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, బ్రిటన్, యూరప్ దేశాల్లోనూ మన ఆకాశవాణి ప్రసారాలు వినిపిస్తాయి.

  • Loading...

More Telugu News