Nikhil Kamath: పెట్టుబడులన్నీ ఈక్విటీల్లోనే పెట్టేయవద్దు: 'జెరోధ' నిఖిల్ కామత్

Nikhil Kamath of Zerodha tells where to put your money and its not equity

  • ఈక్విటీ వ్యాల్యూషన్లు ఖరీదుగా ఉన్నాయన్న జెరోదా అధినేత
  • డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ లో ఎక్కువ పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడి
  • కరెక్షన్ వస్తే ఈక్విటీ వాటా పెంచుకుంటానన్న కామత్

రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతుంటారు. షేరు ధరలు స్వల్ప కాలంలోనే రెట్టింపు అవ్వడం వారిని కట్టిపడేస్తుంది. కానీ, ఈక్విటీ పెట్టుబడుల పరంగా జాగ్రత్తలు తెలిసిన వారు తక్కువ మందే. ప్రముఖ స్టాక్ బ్రోకరేజీ సంస్థ జెరోధ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ప్రస్తుత తరుణంలో పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఈక్విటీల్లో పెట్టేయడం సరికాదంటున్నారు. తాను సైతం ఈక్విటీలకు తక్కువ కేటాయింపులు చేసినట్టు చెప్పారు. 

‘‘ఈక్విటీలు నేడు అధిక వ్యాల్యూషన్లలో ఉన్నాయి. అందుకే బంగారం, ఫిక్స్ డ్ ఇన్ కమ్ సాధనాల్లో నా పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. రెండింటిలోనూ కలిపి 65 శాతంగా ఉంటాయి. కొంత కరెక్షన్ వచ్చే వరకు వేచి ఉండడమే నా ఆలోచన. కరెక్షన్ వచ్చినప్పుడు ఈక్విటీల్లో పెట్టుబడులు పెంచుకుంటాను. నేను ఇప్పటికీ ఈక్విటీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడినే. అయినప్పటికీ ఈక్విటీల్లో ఇంత తక్కువ ఉండడానికి ప్రస్తుతం ఉన్న వ్యాల్యుయేషన్లే కారణం. 

నా మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల్లో ఉన్నది 40 శాతం. డెట్ లో 45 శాతం ఉంటే, బంగారంలో 10 శాతం, రియల్ ఎస్టేట్, ఇతర సాధనాల్లో కలిపి 5 శాతం పెట్టుబడులు ఉన్నాయి. వ్యాల్యూషన్లు తక్కువ స్థాయికి వచ్చినప్పుడు తిరిగి నా ఈక్విటీ పెట్టుబడుల వాటాను పెంచుకుంటాను. పన్ను ప్రయోజనాలు, కాంపౌండింగ్ పవర్ ఆధారంగా ఈక్విటీల్లో ఎక్కువ పెట్టుబడులు ఉండడం అర్థవంతమే’’ అని నిఖిల్ కామత్ తన పెట్టుబడుల వ్యూహాన్ని పంచుకున్నారు.

  • Loading...

More Telugu News