Rahul Gandhi: బ్రిటన్ పర్యటనకు వెళుతున్న రాహుల్ గాంధీ... ప్రఖ్యాత కేంబ్రిడ్జి వర్సిటీలో ప్రసంగం

Rahul Gandhi will tour in Britain and to be given lecture in Cambridge University
  • లండన్ లోని కేంబ్రిడ్జి వర్సిటీలో సదస్సు
  • గతంలో కేంబ్రిడ్జి వర్సిటీలోనే చదివిన రాహుల్
  • మేధావులను కలవనుండడం సంతోషం కలిగిస్తోందన్న కాంగ్రెస్ అగ్రనేత 
ఇటీవల భారత్ జోడో యాత్ర ముగించుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ లో పర్యటించనున్నారు. లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్న రాహుల్ అక్కడి బిజినెస్ స్కూల్లో ప్రసంగించనున్నారు. దీనిపై రాహుల్ ట్వీట్ చేశారు. 

వివిధ రంగాలకు చెందిన మేధావులను కలవనుండడం సంతోషం కలిగిస్తోందని వెల్లడించారు. భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, బిగ్ డేటా, ప్రజాస్వామ్యం తదితర రంగాలకు చెందిన వారిని కలవబోతున్నానని తెలిపారు. నా పాత విద్యాసంస్థను మళ్లీ సందర్శించేందుకు ఎదురుచూస్తున్నాను అని వెల్లడించారు. రాహుల్ గతంలో కేంబ్రిడ్జి వర్సిటీకి చెందిన ట్రినిటీ కాలేజిలోనే విద్యాభ్యాసం చేశారు. 

అంతకుముందు, కేంబ్రిడ్జి వర్సిటీ కూడా రాహుల్ రాకను నిర్ధారించింది. రాహుల్ గాంధీని మరోసారి స్వాగతించేందుకు సంతోషిస్తున్నామని పేర్కొంది. కేంబ్రిడ్జి ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించింది.
Rahul Gandhi
Britain
Cambridge University
London
Congress
India

More Telugu News