Samantha Ruth Prabhu: సమంతా జిమ్ కసరత్తులు మళ్లీ మొదలు.. 2023లో ఎలా ఉండాలో చెప్పిన నటి
- మళ్లీ తన పూర్వపు లైఫ్ స్టయిల్ ఆచరణ
- మయోసైటిస్ సమస్య నుంచి కోలుకున్న నటి
- మీరు కూడా ట్రై చేస్తారా? అంటూ ప్రశ్న
సమంతా రుతు ప్రభు తిరిగి తన కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టినట్టుంది. పూర్వం మాదిరే జిమ్ లో భారీ వ్యాయామాలతో కసరత్తులు మొదలు పెట్టింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఆమె ఒక వీడియో విడుదల చేయగా.. తాజాగా మరో వీడియోని అభిమానులతో పంచుకుంది. మొదటి నుంచి సమంతాకి శారీరకంగా దృఢంగా ఉండడం అంటే ఎంతో ఇష్టం. ఆమె మానసికంగానూ బలవంతురాలేనని అభిమానులకు తెలిసిన విషయమే.