Air India: విమాన పైలట్లకు గోల్డెన్ డేస్.. ఎయిర్ ఇండియాలో భారీ నియామకాలు!
- 470 విమానాలను కొనుగోలు చేస్తున్న ఎయిర్ ఇండియా
- బోయింగ్, ఎయిర్ బస్ సంస్థలకు ఆర్డర్
- వీటిని నడిపేందుకు 6,500 మంది పైలట్ల అవసరం
విమాన పైలట్లకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. కరోనాతో విమాన సర్వీసులు నిలిచిపోయిన వేళ ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన పైలట్లు కూడా ఉన్నారు. కానీ, ఇదంతా గతం. విమానయాన సేవలు పూర్తి స్థాయిలో నడుస్తుండడంతో గతంలో తొలగించిన వారిని మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. అయితే, సమీప భవిష్యత్తులో భారత విమానయాన రంగం మరింత వృద్ధిని చూడనుంది.