Sensex: ఈరోజు మొత్తం నష్టాల్లోనే కొనసాగిన స్టాక్ మార్కెట్లు
- 316 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 91 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా పతనమైన నెస్లే ఇండియా షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ వారాన్ని మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ట్రేడింగ్ మొదలయినప్పటి నుంచి చివరి వరకు సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 316 పాయింట్లు నష్టపోయి 61,002కి పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 17,944 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.18%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.81%), ఏసియన్ పెయింట్స్ (1.01%), ఎన్టీపీసీ (0.51%), రిలయన్స్ (0.42%).
టాప్ లూజర్స్;
నెస్లే ఇండియా (-3.12%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.96%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.94%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.70%), కోటక్ బ్యాంక్ (-1.62%).