Harish Rao: ‘తెలంగాణ బిల్లు’కు 9 ఏళ్లు.. మంత్రి ట్వీట్
- లోక్‌సభలో తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడాన్ని గుర్తుచేసుకున్న హరీశ్ రావు
- 9 ఏళ్ల కిందట ఇదే రోజు చరిత్ర సృష్టించామని వ్యాఖ్య
- నాడు కేసీఆర్ తో కలిసి దిగిన ఫొటో ట్వీట్
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన ముఖ్య విషయాన్ని బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ లో పంచుకున్నారు. లోక్ సభలో తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందింది ఈ రోజేనని పేర్కొన్నారు. సంబరాల్లో భాగంగా నాడు కేసీఆర్ తో కలిసి దిగిన ఫొటోను ఆయన ట్వీట్ చేశారు.
‘‘9 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు చరిత్ర సృష్టించారు. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో దార్శనికత కలిగిన నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించిన ప్రజా ఉద్యమం విజయం సాధించింది’’ అని పేర్కొన్నారు.
ఏపీ విభజన బిల్లును ఫిబ్రవరి 18న లోక్ సభ ఆమోదిస్తే.. 20న రాజ్యసభ పాస్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మార్చి 1న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. జూన్ 2వ తేదీని అపాయింటెడ్ డే గా ప్రకటించారు. అదే రోజును తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.