Mukesh Ambani: శివరాత్రి నాడు రూ.1.51 కోట్ల విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ

Mukesh Ambani Visits Somnath Temple In Gujarat Donates 151 Crores

  • శివరాత్రి రోజు గుజరాత్ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన రిలయన్స్ గ్రూప్ అధినేత
  • కుమారుడు ఆకాశ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖేశ్
  • ఆలయ ట్రస్టుకు రూ.1.51 కోట్ల విరాళం

రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ శనివారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని సోమ్‌నాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. తన కుమారుడు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీతో కలిసి ఆయన దైవదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ.. ఆలయ ట్రస్టుకు రూ.1.51 కోట్ల విరాళం ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో ముఖేశ్ అంబానీ శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లారు. అప్పట్లో ముఖేశ్‌కు కాబోయే కోడలు రాధికా మర్చెంట్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ క్రమంలో ముఖేశ్ రూ.1.51 కోట్ల విరాళాన్ని అందించారు. 

ఇక తండ్రి మరణం అనంతరం ముఖేశ్ అంబానీ రిలయన్స్ సంస్థల పగ్గాలు చేపట్టి ఈ జనవరికి ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన హయాంలో సంస్థ ఆదాయం 17 రెట్లు పెరగ్గా, లాభాల్లో 20 రెట్ల వృద్ధి నమోదైంది. ప్రపంచంలోని అగ్రస్థాయి కార్పొరేట్ సంస్థల్లో ఒకటిగా రిలయన్స్ ఎదిగింది. ఇటీవల కాలంలో టెలికాం, రిటైల్ రంగాల్లోనూ రిలయన్స్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.

  • Loading...

More Telugu News