security: ఒక్కొక్కరు పది మంది ముస్లిం అమ్మాయిల్ని ట్రాప్ చేయాలి: శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్

Trap 10 Muslim girls if you lose 1 Hindu Pramod Muthalik tells youths
  • లవ్ జిహాద్ పేరుతో హిందూ బాలికల ట్రాంపింగ్ పై మండిపడ్డ శ్రీరామ్ సేన చీఫ్
  • ఒక హిందూ యువతిని నష్టపోతే, పది మందితో బదులివ్వాలని పిలుపు
  • అలా చేసే వారికి రక్షణ, ఉఫాది కల్పిస్తామని ప్రకటన
శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ కు స్పందనగా ఒక్కో హిందూ యువతికి బదులుగా పది మంది ముస్లిం అమ్మాయిలను ట్రాప్ చేయాలని పిలుపునిచ్చారు. అలా చేసే వారికి తాము భద్రత, ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ముతాలిక్ మాట్లాడారు. 

‘‘మనకు పరిస్థితి ఎలా ఉందో తెలుసు. ఈ సందర్భంగా హిందూ యువతను నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. మనం ఒక హిందూ యువతిని నష్టపోతే.. కనీసం 10 మంది ముస్లిం అమ్మాయిలను ఆకర్షించాలి. అలా చేస్తే శ్రీరామ్ సేన మీ రక్షణ బాధ్యతను తీసుకుంటుంది. ఉపాధి కల్పిస్తుంది. లవ్ జిహాద్ తో మన అమ్మాయిలు దోపిడీకి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది బాలికలు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. మన చర్యలతో వారిని హెచ్చరించాలి’’ అని ముతాలిక్ వ్యాఖ్యానించారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉడుపి జిల్లా కర్కాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు ముతాలిక్ ఇప్పటికే సంతకేం ఇవ్వడం గమనార్హం. తనపై ఇప్పటి వరకు 109 కేసులు నమోదు కాగా, అందులో ఎక్కువ కేసులు బీజేపీ పాలనలో దాఖలు చేసినవేనని చెప్పారు. హిందుత్వ విషయంలో సొంత వారి నుంచే తాను సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.
security
job
Pramod Muthalik
sriram sena
trap

More Telugu News