Jagan: పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించేలా పారిశ్రామిక విధానం ఉండాలి: సీఎం జగన్
- ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష
- నూతన పారిశ్రామిక విధానంపై చర్చ
- వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం
రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై చర్చించారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను చేయి పట్టుకుని నడిపించేలా పారిశ్రామిక విధానం ఉండాలని దిశానిర్దేశం చేశారు.
పరిశ్రమల స్థాపన నుంచి మార్కెటింగ్ వరకు ప్రోత్సహించేలా ఉండాలని సూచించారు. మార్కెటింగ్ టైఅప్ విధానంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ టైఅప్ లతో ఎంఎస్ఎంఈలతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. ఎంఎస్ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. సరైన మార్కెటింగ్ చూపిస్తే పరిశ్రమలు మరింతగా రాణిస్తాయని తెలిపారు.
కాన్సెప్ట్, కమిషనింగ్, మార్కెటింగ్ లో చేయూతనివ్వాలని పేర్కొన్నారు. అడ్వైజ్, అసిస్ట్ అండ్ సపోర్టివ్ గా ఎంఎస్ఎంఈ పాలసీ ఉండాలని స్పష్టం చేశారు. స్టార్టప్ ల కోసం విశాఖలో పెద్ద భవనం నిర్మించాలని చెప్పారు. ఆ భవనం 3 లక్షల చదరపు అడుగులతో మంచి లొకేషన్ లో ఉండాలని నిర్దేశించారు.