Team India: వర్షంతో నిలిచిన మ్యాచ్... వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన భారత అమ్మాయిలు
- దక్షిణాఫ్రికా వేదికగా టీ20 వరల్డ్ కప్
- టీమిండియా వర్సెస్ ఐర్లాండ్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 రన్స్ చేసిన భారత్
- ఐర్లాండ్ లక్ష్యఛేదనకు వర్షం అడ్డంకి
- 8.2 ఓవర్ల వద్ద నిలిచిపోయిన మ్యాచ్
- డీఎల్ఎస్ ప్రకారం 5 రన్స్ తేడాతో భారత్ విక్టరీ
మహిళల టీ20 ప్రపంచకప్ లో టీమిండియా సెమీఫైనల్లో ప్రవేశించింది. ఇవాళ ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా డక్ వర్త్ లూయిస్ విధానంలో 5 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది.
ఐర్లాండ్ లక్ష్యఛేదనలో 8.2 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం విజేతను నిర్ణయించారు.
వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఐర్లాండ్ స్కోరు 2 వికెట్లకు 54 పరుగులు. డీఎల్ఎస్ ప్రకారం అప్పటికి 59 పరుగులు చేసుంటే ఐర్లాండే గెలిచేది. కానీ, ఐర్లాండ్ 5 పరుగులు వెనుకబడి ఉంది. దాంతో భారత్ ను విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో టీమిండియా అమ్మాయిలు సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నారు.