Rishab Shetty: 'కాంతార 2'లో కనిపించనున్న రజనీకాంత్?

kantara movie update
  • రిషబ్ శెట్టి క్రేజ్ ను పెంచేసిన 'కాంతార'
  • ప్రీక్వెల్ కోసం రంగంలోకి దిగిన హీరో 
  • పాన్ ఇండియా స్థాయి ఆర్టిస్టుల కోసం అన్వేషణ 
  • రజనీని ఒప్పించే ప్రయత్నంలో ఉన్న రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన 'కాంతార' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేసింది. కేవలం 16 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దర్శకుడిగా .. రచయితగా కూడా ఈ సినిమా రిషబ్ శెట్టికి ప్రశంసలను తెచ్చిపెట్టింది. 

ఆ మధ్య రజనీకాంత్ కూడా రిషబ్ శెట్టిని తన ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఆ తరువాత ఈ సినిమాకి ప్రీక్వెల్ చెయ్యడానికి రిషబ్ శెట్టి రంగంలోకి దిగాడు. ఫస్టు పార్టుకి పాన్ ఇండియా స్థాయిలో రెస్పాన్స్ రావడం వలన, సెకండ్ పార్టును పాన్ ఇండియా రేంజ్ లోనే నిర్మించాలనే ఆలోచనలో రిషబ్ శెట్టి ఉన్నాడు. 

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా దూసుకుని వెళ్లాలంటే ఆ స్థాయి తారాగణం కూడా అవసరం. అందువలన ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్రలో రజనీకాంత్ కాసేపు కనిపిస్తే బాగుంటుందని భావించిన రిషబ్ శెట్టి, ఆయనను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడని అంటున్నారు. మరి రజనీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనేది చూడాలి.
Rishab Shetty
Rajanikanth
Kantara Movie

More Telugu News