EPFO: ఈపీఎఫ్ఓలో 577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ
- ఈ నెల 25 నుంచే దరఖాస్తుల స్వీకరణ
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) లో అకౌంట్స్ ఆఫీసర్ సహా 577 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (ఈవో), అకౌంట్స్ ఆఫీసర్ (ఏవో) తో పాటు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. పరీక్షకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ను ఒకటి రెండు రోజుల్లో జారీ చేయనున్నట్లు సమాచారం.
ముఖ్యమైన వివరాలు..
మొత్తం పోస్టులు: 577 (ఇందులో ఈవో, ఏవో పోస్టులు 418, ఏపీఎఫ్‌సీ పోస్టులు 159)
దరఖాస్తు: ఈ నెల 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. మార్చి 17 సాయంత్రం 6 గంటలకు ముగింపు
అర్హతలు: ఏదైనా డిగ్రీ, ఈవో, ఏవో పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్లు. ఏపీఎఫ్‌సీ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు
పరీక్ష రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.25. ఎస్సీ/ఎస్టీ/పీబ్ల్యూడీ/మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం..
యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆపై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.