Weight Loss: బరువు తగ్గాలంటే.. ఫైబర్ కు జై కొట్టాల్సిందే

high Fibre Vegetables To Add To Your Weight Loss Diet

  • పీచుతో కూడిన ఆహారంతో కడుపు నిండిన భావన
  • వెనువెంటనే మళ్లీ ఆహారం తీసుకోకుండా నియంత్రణ
  • క్యారెట్, బీట్ రూట్, గ్రీన్ పీస్, బ్రొక్కోలీ మంచివి

కొందరికి బరువు తగ్గాలన్న కోరిక ఉంటుంది. కానీ పట్టుదల, ఆచరణ లోపిస్తాయి. బరువు తగ్గడం నిజానికి అంత కష్టమైన పనేమీ కాదు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. సమతులాహారం, రాత్రి వేళల్లో సరిపడా, నాణ్యమైన నిద్ర, వ్యాయామం పాత్ర కూడా ఎంతో ఉంటుందని గుర్తించాలి. ఆహార పరంగా ఫైబర్ కు ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు బరువు తేలిగ్గా తగ్గొచ్చు. 

ఆహారంలో భాగంగా ఫైబర్ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావు. పీచు ఉండడం వల్ల తిన్నదంతా ఒకేసారి జీర్ణం కాదు. క్రమబద్ధంగా జరుగుతుంది. దీంతో బ్లడ్ షుగర్ కూడా నియంత్రణలో ఉంటుంది. కడుపు నిండిన భావనతో వెంటనే మళ్లీ ఏదో ఒకటి తినాలని అనిపించదు. దీనివల్ల ఆహారపరమైన నియంత్రణ ఏర్పడుతుంది. కనుక బరువు తగ్గాలని అనుకునే వారు ఫైబర్ తో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

బీట్ రూట్
బీట్ రూట్ లో పీచు పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఐరన్, ఫొలేట్, పొటాషియం కూడా ఇందులో లభిస్తుంది. సలాడ్స్ లో భాగంగా తీసుకోవచ్చు. జ్యూస్ చేసుకుని తీసుకోవచ్చు. కూర చేసుకుని తినొచ్చు.

బ్రొక్కోలీ
ఇది మన దేశ పంట కాదు. కానీ, మన దగ్గర కూడా దీని సాగు విస్తరిస్తోంది. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల బ్రోక్కోలీ తీసుకుంటే రోజులో కావాల్సిన ఫైబర్ లో 10 శాతం భర్తీ అవుతుంది. 

బంగాళాదుంప
బంగాళాదుంపలో పీచు తక్కువే. కాకపోతే పై పొట్టులో ఫైబర్ ఎక్కువ. కనుక పొట్టు తీయకుండా బంగాళాదుంపను తినడం అలవాటు చేసుకోవాలి. 

గ్రీన్ పీస్
పచ్చి బఠానీలోనూ పీచు ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల గ్రీన్ పీస్ తీసుకుంటే రోజులో కావాల్సిన ఫైబర్ లో 20 శాతం భర్తీ అవుతుంది.

క్యారట్
క్యారట్ లోనూ పీచు ఎక్కువే. ఇది కళ్లకు మంచిది. ఇందులో సొల్యుబుల్, ఇన్ సొల్యుబుల్ ఫైబర్ ఉంటాయి. కనుక బరువు తగ్గడానికి ఇది చాలా మంచిది. ఉడికించే పనిలేకుండానే క్యారెట్ ను నేరుగా తినొచ్చు. జ్యూస్ చేసుకుని, లేదా కూర, సూప్ రూపంలో, సలాడ్ గానూ తీసుకోవచ్చు.
 
దోసకాయ
బరువు తగ్గడానికి దోసకాయ తనవంతు సాయం చేస్తుంది. ఇందులో నీటి పరిమాణం ఎక్కువ. పీచు కూడా లభిస్తుంది. ఆకుపచ్చని రంగులో ఉండే దోసకాయలో పీచు ఎక్కువగా లభిస్తుంది.

  • Loading...

More Telugu News