Boy: బాలుడిపై కుక్కల దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు
- కుక్కల దాడిలో తీవ్ర గాయాలతో బాలుడి మృతి
- మీడియా కథనాల ఆధారంగా విచారణకు తీసుకుంటున్నట్టు హైకోర్టు వెల్లడి
- జీహెచ్ఎంసీ ఏంచేస్తోందని ప్రశ్నించిన న్యాయస్థానం
హైదరాబాదు నగరంలో కొన్నిరోజుల కిందట వీధి కుక్కలు ఐదేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేయడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కాగా ఈ ఘటనను తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మీడియా కథనాల ఆధారంగా విచారణకు తీసుకుంటున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. వీధి కుక్కల అంశంలో జీహెచ్ఎంసీ ఏంచేస్తోందని ప్రశ్నించింది.
ఈ ఉదంతంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని అభిప్రాయపడింది. వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, అంబర్ పేట మున్సిపల్ అధికారికి నోటీసులు జారీ చేసింది. బాలుడి మృతి బాధాకరమని, నష్ట పరిహారం అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.